జనగామ జిల్లా బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ కు చెందిన రవికుమార్ అనే వ్యక్తికి పాలకుర్తి మండలానికి చెందిన జయంతితో 2024 డిసెంబర్ 26న వివాహం అయింది. సంక్రాంతి పండుగకి పాలకుర్తిలోని అత్తారింటికి వెళ్లాడు. జనవరి 15న రాత్రి ఫ్రెండ్స్ కాల్ చేయడంతో మాట్లాడి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన అల్లుడు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.