జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారి పై శుక్రవారం తెల్లవారుజామున కోర్ర తండా వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నర్మెట్ట మండలం రాళ్లబాయి తండా కి చెందిన ఇస్లావత్ నవీన్ గా గుర్తించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.