ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జనగాం జిల్లా పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్ అన్నారు. ఈరవెన్ను గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.