కొమురవెల్లి మల్లన్న కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కొమ్మూరి

60చూసినవారు
కొమురవెల్లి మల్లన్న కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కొమ్మూరి
ఈ నెల డిసెంబర్ 29న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ ఏర్పాట్లను జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. తోటబాయి వద్ద కల్యాణ వేదిక, రాజగోపురం ముందు క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, చెరుకు రమణారెడ్డి, మెరుగు కృష్ణ గౌడ్, ఆడెపు నరేందర్, దాసరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్