కొమురవెల్లి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం అమిత్ షా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.