ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండలోని టీఎస్ గురుకుల విద్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను అంబులెన్సులో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.