మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 11 మంది సీనియర్ అబ్జర్వర్‌లు, ఇద్దరు కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ నుండి సీనియర్ అబ్జర్వర్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన మంత్రి సీతక్క కు నార్త్ మహారాష్ట్ర అబ్జర్వర్ గా నియమించారు. అలాగే మరాట్వాడ ప్రాంతానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అబ్జర్వర్ గా నియమించారు.