గూడూరు లో భారీ వర్షం

70చూసినవారు
మహబుబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం మబ్బుగా మారింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉక్కపోత తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం తో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్