మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పై మంగళవారం రాత్రి గుంజేడు సమీపంలో ఒక అగంతకుడు బండి పై వచ్చి ఇటుక రాయి తో బస్సును వెనుక కొట్టడంతో అద్దం ధ్వంసం అయింది. వెనుక ఎవరు లేక పోవడంతో
ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఆర్టీసీ డ్రైవర్ కొత్తగూడ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు సమాచారం, ఎందుకు అద్దం పగులగొట్టారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.