ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేశారు సర్వ శిక్ష ఉద్యోగులు. ఎన్నికల్లో సర్వ శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ లో వినూత్న నిరసన చేశారు. ఇప్పటికైనా తమను క్రమబద్ధీకరించాలని కోరారు.