మహబూబాబాద్: పౌష్టికాహారంపై అవగాహన ముఖ్యం
విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పౌష్టికాహారం పై దృష్టిసారించేలా చూడాలని, వాటిలో ఉన్న పోషక గుణాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తప్పనిసరిగా టీచర్స్ తెలియజేయాలని శ్రీలత హెల్పింగ్ సొసైటీ చైర్మన్ శ్రీలత బుధవారం అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, అరటి పళ్ళు, పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు పంపిణీ చేశారు.