ములుగు జిల్లా తాడ్వాయి-పస్ర మధ్య అటవీప్రాంతంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకుల ఆటవిడుపు కోసం పలు క్రీడా అంశాలను ఏర్పాటు చేయాలని, క్లాక్ టవర్ వెళ్లే మార్గంలో చెక్కతో చేసిన మెట్లను అమర్చాలని అటవిశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.