ములుగు జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 33/11 కేవి సబ్ స్టేషన్లలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఉ. 10 నుండి 11: 30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ములుగు డిఈ నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కాసిందేవిపేట, పత్తిపల్లి, అబ్బాపూర్, పందికుంట, వెంకటాపూర్, నర్సాపూర్, పస్ర, గోవింద రావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, ఏటూరు, రాజుపేట, మంగపేట తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.