మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. శుక్రవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటిఆర్ మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేటిఆర్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం పట్ల కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.