ములుగు: డిసెంబర్ 9 లోగా రూ.2లక్షల లోపు రుణమాఫీ

55చూసినవారు
ములుగు: డిసెంబర్ 9 లోగా రూ.2లక్షల లోపు రుణమాఫీ
ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో మంత్రి సీతక్క మంగళవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ 9 లోగా రూ. 2లక్షల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అలాగే, పొలంబాట కార్యక్రమంలో పొలాలకు రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్