ములుగు జిల్లా మంగపేట మండలంలోని లోతట్టు ప్రాంతాలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలకు తగు జాగ్రత్తలను సూచనలు చేశారు. ఇందులో భాగంగా రాజుపేటలోని ముసలమ్మవాగు ఉదృతికి కోతకు గురవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్కకు తెలిపారు. మంత్రి స్పందిస్తూ 800 మీటర్ల రివిట్మెంట్ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.