ముస్లింల సమస్యల పరిష్కారానికి చర్యలు: పైడాకుల అశోక్

85చూసినవారు
ముస్లింల సమస్యల పరిష్కారానికి చర్యలు: పైడాకుల అశోక్
ములుగు జిల్లాలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులకు అశోక్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్