ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో అదుపుతప్పి ఓ లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పక్కనే పార్కు చేసి ఉన్న ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది. కాగా భూపాలపల్లి నుంచి బొగ్గు లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.