ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మలను ములుగు కలెక్టర్ దివాకర్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, ఎండోమెంట్ అధికారులు కలెక్టర్ కు డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. రాబోయే మినీ మేడారం జాతరపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.