షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: ములుగు కలెక్టర్

69చూసినవారు
షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: ములుగు కలెక్టర్
ములుగు మండలం మల్లంపల్లి, జంగాలపల్లి సంతలలో అదనంగా నిర్మిస్తున్న షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని శనివారం జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మల్లంపల్లి, జంగాలపల్లి సంత ఆవరణలో నిర్మిస్తున్న షెడ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు మీద టెంట్లు వేసుకొని వ్యాపారం చేయడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్