ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మనీషా(25) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం ఈనెల 29న ఇంట్లో చిన్నపాటి గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 31న మృతి చెందింది.