వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శుక్రవారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారం పై టామ్ టామ్ వేయించారు. రుద్రగూడెం సమీపంలో పులి, తనపిల్లలతో తిరుగుతుందని సమీప ప్రాంత రైతులు, ప్రజలు రాత్రివేళ అవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వచ్చిన రైతులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు.