ప్రభుత్వ వసతిలో ప్రైవేట్ శుభకార్యం

79చూసినవారు
ప్రభుత్వ వసతిలో ప్రైవేట్ శుభకార్యం
నెక్కొండ మండలంలోని ప్రభుత్వ వసతి గృహంలో ప్రైవేట్ శుభకార్యం జరిగిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. అదే హాస్టల్ లో సిబ్బందిగా పనిచేసే వ్యక్తి కూతురు శ్రీమంతం కార్యక్రమాన్ని బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండువగా నిర్వహించడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సంబంధిత వార్డెన్ ను వివరణ కోరగా తనకు సమాచారం అందించిన అనంతరమే కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలపడం గమనార్హం.