జనగాం జిల్లా పాలకుర్తి మండలం నారబోయినగూడెం గ్రామానికి చెందిన దోపతి సరోజన(55) మృతి చెందగా భర్త రాంరెడ్డి గురువారం జిల్లా కేంద్రమైన జనగాం వైద్య కళాశాలకు ఆమె కోరిక మేరకు మృతదేహాన్ని అందించారు. శుక్రవారం ఈ సందర్భంగా మహాత్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ గంట రవిందర్ మాట్లాడుతూ, తన మరణానంతరం కూడా మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తానని సరోజ కుటుంబ సభ్యులను అభినందించారు.