దేవరుప్పుల: గుండెపోటుతో యువకుడు మృతి

80చూసినవారు
దేవరుప్పుల: గుండెపోటుతో యువకుడు మృతి
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన దేవరుప్పుల మండలం పెద్దతండాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుగులోతు నరేందర్ (26) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. అందరితో సుపరిచితుడుగా ఉండే నరేందర్ మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్