తొర్రూరులో బీజేపీ నాయకుల సంబురాలు

369చూసినవారు
తొర్రూరులో బీజేపీ నాయకుల సంబురాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం పట్ల తొర్రూరు బీజేపి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో గురువారం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ. ఉత్తరప్రదేశ్లో రెండోసారి యోగి పరిపాలను మెచ్చి ప్రజలు పట్టం కట్టారని, యూపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా రెండోసారి గెలవలేదని, అలాంటి చరిత్రను తిరగరాసి యోగి అఖండ మెజారిటీతో విజయం సాధించారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తం చేస్తూ. స్పష్టమైన తీర్పు ఇచ్చి ఆశీస్సులు ఇస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, 15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, పరుపాటి రామ్మోహన్ రెడ్డి, రచ్చ కుమార్, రంగు రాములు, పూసాల శ్రీమాన్, అలిసేరి రవిబాబు, మధుసూదన్ రెడ్డి, యాకయ్య, రవి, శేఖర్, రాజేష్, రాజు కుమార్, నవీన్, భరత్, శ్రావణ్, యాకన్న రాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్