వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని గ్రామస్తుల సమస్యలపై సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలు తీరులో నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలోని పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించుటకు కృషి చేస్తానన్నారు.