చిరు వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండ్లు, కూరగాయల వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. పలు సమస్యలను చిరు వ్యాపారస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని తెలిపారు.