పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ముఖ్య కార్య కర్తల సమావేశం బొచ్చు ప్రశాంత్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా పరకాల మండల కమిటీ నిర్మాణం కోసం ఈ నెల 18న పరకాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల నూతన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.