అస్తవ్యస్తంగా ఉన్న పరకాల పట్టణాన్ని సుందరీకరణం చేసి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజలు సామాజిక బాధ్యతగా సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా పర్యటించారు. వడ్డెర కాలనీ, మమతా నగర్, బస్ డిపో పక్క వీధి, శ్రీనివాస కాలనీ, బంధం చెరువు రోడ్డు, నటరాజ్ థియేటర్ కాలనీ, తదితర ప్రాంతాలను పర్యటించారు.