కాట్రపల్లి గ్రామంలో వైభవంగా ప్రారంభమైన శివరాత్రి సంబరాలు

574చూసినవారు
కాట్రపల్లి గ్రామంలో వైభవంగా ప్రారంభమైన శివరాత్రి సంబరాలు
సంగెం మండలంలోని కాటపల్లి గ్రామంలో శివ సమేత శ్రీరామచంద్రాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ శోభాయమానమైన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి స్వామి, సత్సంగ్ సభ్యులు , గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు , గ్రామ ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్