మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం పెద్ద తండా (మేచరాజుపల్లి) గ్రామంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. నేడు ఉదయం గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్, జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మహేందర్ రెడ్డి,, వార్డు సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, పంచాయితీ సెక్రటరీ కళ్యాణ్, మహిళ సంఘ సభ్యులు, అంగన్వాడి టీచర్స్, ఆశ కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.