ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలను" పండుగ వాతావరణం కల్పించేలా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పరకాలలో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలన్న్నారు.