ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు : ఎమ్మెల్యే

65చూసినవారు
ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు : ఎమ్మెల్యే
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు తీర్పుపై సోమవారం సాయంత్రం స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ ఎస్ కు లేదని దుయ్యబట్టారు. రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. గతంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, టీడీపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మండి పడ్డారు.

సంబంధిత పోస్ట్