జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.