కరాటే పోటీలలో శ్రీ నలంద విద్యార్థులకు పతకాల పంట
వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో వరల్డ్ పునకోసి సూటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 9వ జాతీయస్థాయి సూటోకాన్ కరాటే పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో 12 సంవత్సరాల లోపు విభాగంలో లాస్య శ్రీ కటాస్ లో రజిత, కమిటీలో కాoస్య పతకం, జి శివ కటాస్ కమిటీ విభాగాలలో కాoస్య పతకం సాధించగా, 11 సంవత్సరాల లోపు విభాగంలో జి మణిదీప్ కమిటీలో బంగారు కటాస్ లో రజత పతకం సాధించగా, 10 సంవత్సరాల లోపు విభాగంలో రాణా ప్రతాప్ కటాస్ లో కాంస్య కమిటీలో బంగారు పతకం సాధించగా, 9 సంవత్సరాల లోపు విభాగంలో పి అమిత్ కటాస్ లో రజిత కమిటీలో బంగారు పతకం, సాధించగా, 8 సంవత్సరాల లోపు విభాగంలో జశ్విన్ కటాస్ లో రజిత కమిటీలో బంగారు పతకాలు పతకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలడుగు రవీందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ యాకన్న, కరాటే మాస్టర్ రాజేష్ కుమారం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.