కార్పొరేటర్ రవి అరెస్ట్

569చూసినవారు
కార్పొరేటర్ రవి అరెస్ట్
వరంగల్ కరీమబాద్ 40వ డివిజన్ కార్పొరే టర్ మరుపల్ల రవిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఉర్సు ప్రాంతానికి చెందిన పసునూరి అరవింద్ ఫిబ్రవరి 12న కుమ్మరివాడలోని తన ప్లాటును చూస్తుండగా, తన పెద్దనాన్న ఎల్లస్వామి, పెద్దమ్మ, వారి కుమారులు అక్కడికి వచ్చారు. కార్పొరేటర్ రవి వారికి సపోర్ట్ చేస్తూ చంపేస్తామని బెదిరించడంతోపాటు, కులం పేరుతో దూషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్