చేనేత అభయ హస్తం పథకం చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకే ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని టీపీసీసీ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేనేత అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ పద్మశాలి నాయకులు సీఎం ఫ్లెక్సీ కి పాలాభిషేకం నిర్వహించారు. 163 కోట్ల రూపాయలతో చేనేత అభయ హస్తం పథకాన్ని ప్రారంభించిందన్నారు.