ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పాటు పడుతూ సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకాలను తమ కళారూపాల ద్వారా అద్భుతంగా వివరిస్తూ ఆలేఖ్య పుంజాలా బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ లోని మధ్య కోటలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.