ఖిలా వరంగల్ మండలం మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ కు చెందిన ఏఆర్ఎస్సైలు సత్యనారాయణ, మల్లారెడ్డి పదవీ విరమణ పొందారు. వారికి శనివారం సాయంత్రం వీడ్కోలు సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి హాజరై పదవీ విమరణ పొందిన ఏఆర్ఎస్సై లకు మెమోంటో అందజేసి సన్మానించారు. ఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్, ఆర్లు శోభన్, పురుషోత్తంరెడ్డి, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.