ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల ఆసుపత్రులపై తెలంగాణ స్టేట్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా ఆర్ఎంపి, పి. ఎం. పి వైద్యుల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. గురువారం ఖిలా వరంగల్లోని అమరవీరుల జంక్షన్ వద్ద ఆర్ఎంపి వైద్యుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఖిల వరంగల్ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.