స్టేషన్ ఘన్పూర్, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న మూడు, నాలుగు రోజుల్లో డబ్బులు రాకుంటే నా వద్దకు రండి ..ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండలం లోని పళ్ళగుట్ట గ్రామం లో పీఏసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తేనే రూ .500 బోనస్ వస్తుందని అన్నారు.