రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

1062చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ను పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు పరోపకారం వంటి మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని అన్నారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్