ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించనున్న అండర్-19 ఎసీజీఎఫ్ బాలబాలికల క్రీడా పోటీల వివరాలను హనుమకొండ డీవైఎస్ గుగులోత్ అశోక్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 25వ తేదీన మొదటి విడతలో టిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, నెట్ బాల్, కరాటే, లాన్స్టిన్నీస్, బాస్కెట్బాల్, సాఫ్ట్బేల్, క్రికెట్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.