రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని అన్నారు. వరంగల్ జిల్లా మంత్రులు కొండ సురేఖ, సీతక్క, ఎమ్మెల్సీ సారయ్య లతో కలిసి వరంగల్ జిల్లా శాసనసభ్యులతో మంగళవారం సమావేశం అయ్యారు.