హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో వినతులను అందించగా ఉన్నతాధికారులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 129 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, డిఆర్డీఓ సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.