వరంగల్ నగర అభివృద్ధికి ఆర్థిక సంఘం నుండి 4500 కోట్లు కేటాయించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి విన్నవించారు. సోమవారం ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సంఘ సభ్యులు, పట్టణ, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమన్నారు.