హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఆర్‌అండ్‌బి, పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు సేఫ్టీ కి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రోడ్డు సేఫ్టీకి తీసుకోనున్న ముందస్తు చర్యల వివరాలను తెలిపారు.