నేడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో వరంగల్ నగరంలోని పలు దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. అందులో భాగంగా వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటికీటలాడాయి. భక్తుల కోసం ఏర్పాటుచేసిన క్యూలైన్లో గంటల తరబడి వెయిట్ చేసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు వరలక్ష్మి వ్రతంలో కూర్చొని పూజలు నిర్వహించారు.