వరంగల్లో వరద నష్టం రూ. 18కోట్లు

76చూసినవారు
గ్రేటర్ వరంగల్ పరిధిలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో రూ. 18కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బస్ స్టేషన్ రోడ్డు, డ్రెయినేజీ, బీటీ, సీసీ, మట్టి రోడ్లు, కల్వర్టులు, మురుగు కాల్వలు, తాగునీటి పైపులైన్లు, దెబ్బతిన్నాయని అధికారులు తేల్చారు. హనుమకొండ ప్రాంతంలో రూ. 10కోట్లు, వరంగల్ ప్రాంతంలో రూ. 8కోట్ల వరకు నష్ట నివేదికను సోమవారం సాయంత్రం అధికారులు పంపించారు.

సంబంధిత పోస్ట్